విజయవాడ, 1 అక్టోబర్ (హి.స.): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చకచకా సాగుతోంది. సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే వేగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికే రికార్డుస్థాయిలో 95.20శాతం మేర పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 64.38లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటికే 61.29లక్షల మంది చేతికి సచివాలయ సిబ్బంది ఫించన్ల నగదును అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల