
హైదరాబాద్, 26 జనవరి (హి.స.)
న్యూజిలాండ్ తో జరుగనున్న చివరి రెండు టీ20 మ్యాచ్లపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్లకు ఆల్రౌండర్ తిలక్ వర్మ(Tilak Verma) దూరంగా ఉంటారని స్పష్టం చేసింది. దీంతో 20 జట్టులో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్లో ఇప్పటికే మూడు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్నది. మిగిలిన మరో రెండు మ్యాచుల్లో ఓడినా పెద్ద ప్రభావం ఉండదు.
మిగిలిన నాలుగో మ్యాచ్ జనవరి 28న విశాఖపట్నంలో, చివరి టీ20 మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..