
అమరావతి, 26 జనవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు అద్భుతంగా జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. ఈ కార్యక్రమం భవిష్యత్తు లక్ష్యాలకు అద్దంపట్టింది. నేలపాడు ప్రాంతంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలో పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాయి’ అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ