పాకిస్తాన్ పై జరిగిన తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ భారీ విజయం
స్పోర్ట్స్, 11 అక్టోబర్ (హి.స.) పాకిస్తాన్పై తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయం నమోదు చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్ పాకిస్థాన్ 556 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 823-7 స్కోర్
పాకిస్తాన్పై తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం


స్పోర్ట్స్, 11 అక్టోబర్ (హి.స.)

పాకిస్తాన్పై తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయం నమోదు చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్ పాకిస్థాన్ 556 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 823-7 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ పాక్ 220 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో పాకిస్థాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 500+ పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ ఓడిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. కాగా, ట్రిపుల్ సెంచరీతో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande