తెలంగాణ, 18 డిసెంబర్ (హి.స.)
ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ ప్రకటన చేసేముందు అశ్విన్ డ్రెస్సింగ్ గదిలో విరాట్ కోహ్లితో భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతలోనే ఆశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
భారత్ తరపున ఆడినందుకు ఎంతో గర్విస్తున్నానని అశ్విన్ వీడ్కోలు సమయంలో అన్నాడు. కెరీర్లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3503 పరుగులు సాధించానని, భారత్ క్రికెట్లో తన భాగస్వామ్యం కూడా ఉండటం ఆనందంగా ఉందని అశ్విన్ తెలిపాడు. గురువారం అనగా రేపు అశ్విన్ ఇండియాకి రానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్