టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ..
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఊతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ చెల్లించకుండా
క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఊతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పీఎఫ్ రీజనల్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పీఎఫ్ రీజనల్ కమిషనర్ గోపాల్ రెడ్డి వారెంట్ జారీ చేయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని పులకేశినగర్ పోలీసులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande