సియాటెల్‌ ప్రాంతంలో 33,000మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె
సియాటెల్‌, 12 అక్టోబర్ (హి.స.)ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing).. పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా 17వేల మంది సిబ్బందిపై వేటు వేయ
సియాటెల్‌ ప్రాంతంలో 33,000మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె


సియాటెల్‌, 12 అక్టోబర్ (హి.స.)ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing).. పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా 17వేల మంది సిబ్బందిపై వేటు వేయనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10శాతం మందిని తొలగించనుంది.

సియాటెల్‌ ప్రాంతంలో 33,000మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్‌ అన్నారు. ‘‘ రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10శాతం మందిని తగ్గించాలని చూస్తున్నాం. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఉండనున్నారు’’ అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం బోయింగ్‌ ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయాత్మక చర్యలు అవసరం అని బోయింగ్‌ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరం అని పేర్కొంది. సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 777X జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నట్లు బోయింగ్‌ తెలిపింది. 2026లో వీటి డెలివరీలు అందిస్తామని వెల్లడించింది. ప్రస్తుత ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత 2027లో 767 ఫ్రైటర్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని బోయింగ్‌ యోచిస్తోంది. ఈనేపథ్యంలో బోయింగ్‌ షేర్లు 1.1శాతం క్షీణించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande