నైజీరియాలో ఘోర విషాదం..హాలిడే ఫెయిర్ తొక్కిసలాటలో పలువురు చిన్నారులు మృతి..
తెలంగాణ, 19 డిసెంబర్ (హి.స.)నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. హాలిడే ఫెయిర్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు. నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల న
నైజీరియాలో ఘోర విషాదం..


తెలంగాణ, 19 డిసెంబర్ (హి.స.)నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. హాలిడే ఫెయిర్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు.

నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల నిర్వహించిన హాలిడే ఫెయిర్ సందర్భంగా బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఓయో రాష్ట్రంలోని ఇస్లామిక్ హైస్కూల్ బసోరున్లో తొక్కిసలాట సంభవించిందని, మరిన్ని మరణాలు సంభవించకుండా భద్రతా బలగాలు మోహరించినట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ సెయి మకిండే తెలిపారు. ఈ మరణాల కారణంగా దుఖంలో ఉన్న తల్లిదండ్రులకు గవర్నర్ సానుభూతి తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande