స్పోర్ట్స్, 12 అక్టోబర్ (హి.స.)
సూర్యకుమార్ నేతృత్వంలోనే భారత
టీ20 జట్టు జోరు మీద ఉన్నది. బంగ్లాదేశ్ను వరుసగా రెండు మ్యాచ్లో ఓడించి టీ20 సిరీస్ దక్కించుకుంది.
ఇప్పుడు సిరీస్ క్లీన్స్వీప్ కన్నేసింది. నేడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నామమాత్రపు మూడో టీ20 జరగనుంది. హ్యాట్రిక్ విజయం సాధించి సిరీస్ వైట్వాష్ చేయాలని భారత కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. టీమిండియా దూకుడు చూస్తుంటే
భారత్ గెలుపు ఖాయంగానే కనిపిస్తున్నది. మరోవైపు,ఆఖరి టీ20లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..