చిలమత్తూరు గ్యాంగ్‌రేప్‌ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించాల
హిందూపురం, 13 అక్టోబర్ (హి.స.) గ్యాంగ్‌ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్‌ స్పందించారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్‌ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగ
చిలమత్తూరు గ్యాంగ్‌రేప్‌ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించాల


హిందూపురం, 13 అక్టోబర్ (హి.స.) గ్యాంగ్‌ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్‌ స్పందించారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్‌ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్తూరు జిల్లాలో బాలిక హత్యపై అక్కడికి వెళతారని ప్రకటించగానే హడావిడిగా మంత్రులు వెళ్ళారన్నారు. చిలమత్తూరు గ్యాంగ్‌రేప్‌ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, అనంతపురం జిల్లా మంత్రి సవిత, హోంమంత్రి అనిత ఇంతవరకు బాధితులను పరామర్శించలేదని.. ఇంతకంటే దారుణం ఉంటుందా అని మండిపడ్డారు. మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అప్పటికప్పుడు హెలికాఫ్టర్‌లో ఉన్నతాధికారులను పంపిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని.. ఈ గ్యాంగ్‌ రేప్‌పై కూడా అంతే స్థాయిలో స్పందించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande