గుజరాత్ లో విషాదం.. మట్టి పిల్లలు విరిగిపడి తొమ్మిది మంది మృతి
గుజరాత్, 13 అక్టోబర్ (హి.స.) గుజరాత్ మెహసాణా జిల్లాలో మట్టి పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో జసల్పుర్ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్ను కూలీలు త
గుజరాత్లో విషాదం


గుజరాత్, 13 అక్టోబర్ (హి.స.)

గుజరాత్ మెహసాణా జిల్లాలో మట్టి

పెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో జసల్పుర్ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్ను కూలీలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో వదులుగా ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా వారిపై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. కడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాద వివరాలను ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్సాన్హ్ వాఘేలా వెల్లడించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande