
హైదరాబాద్, 02 ఫిబ్రవరి (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని
విధంగా భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఉత్సాహంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్తగా రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ ఏకంగా 943.52 పాయింట్లు లాభపడి, 81,666.46 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 262.95 పాయింట్ల లాభంతో 25,088 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, నిఫ్టీ తొలిసారిగా 25,000 మార్కును అధిగమించి స్థిరపడటం విశేషం. దాదాపు ఇవాళ అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే పయనించాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..