
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.) పాకిస్థాన్లో 48 గంటలుగా పాక్
సైన్యం - బలూచిస్థాన్ ప్రావిన్స్ మధ్య భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన 'ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2' (Operation Herof 2.0) ధాటికి భద్రత దళాలు విలవిలలాడాయి. ఈ భీకర దాడులతో ఇరువైపులా కలిపి సుమారు 225 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
గత నెల జనవరి 31 శనివారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులు 'ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2'లో భాగంగా క్వెట్టా, గ్వాదర్, నోష్కీ, మస్తుంగ్ సహా సుమారు 12 జిల్లాల్లో ఏకకాలంలో జరిగాయి. BLA తిరుగుబాటుదారులు పక్కా ప్రణాళికలతో అధునాతన ఆయుధాలు, గ్రెనేడ్లు, ఆత్మాహుతి దళాలతో (Fidayeens) పోలీస్ స్టేషన్లు, హై-సెక్యూరిటీ జైళ్లు, సైనిక స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ముఖ్యంగా మస్తుంగ్లో జైలుపై దాడి చేసి 30 మంది ఖైదీలను విడిపించడం సంచలనం సృష్టించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..