
ముంబై,03 ఫిబ్రవరి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల పంట పండింది. గంటల వ్యవధిలోనే కోట్ల సంపాదన జేబుల్లో పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అన్ని పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైంది.
భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం జరిగింది. ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త భారతీయులకు కొత్త జోష్ తెప్పించింది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది ప్రజల తరపున ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఇన్వెస్టర్లకు బాగా కలిసొచ్చింది. ఎన్నడూ లేనంతగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోయింది. దీంతో గంటల వ్యవధిలోనే రూ.20 లక్షల కోట్ల సంపాదన వారి జేబుల్లో పడ్డాయి. దీంతో పెట్టుబడిదారులకు నూతనోత్సాహం వచ్చింది. ఇక ప్రధాని మోడీని ఎన్డీఏ ఎంపీలు ఘనంగా సన్మానించారు. ‘‘భారత్ మాతాకీ జై’’, ‘‘వందేమాతరం’’ నినాదాలతో మార్మోగించా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ