
ఢిల్లీ,03ఫిబ్రవరి (హి.స.) ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.. దానికి కారణం అమెరికా నుంచి వచ్చిన కీలక ప్రకటన. ఈ ప్రకటనతో భారత మార్కెట్‌లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసే కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్‌పై విధించిన టారిఫ్‌ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు 50 శాతం పెంచుతామన్న టారిఫ్‌లను ఏకంగా 18 శాతానికి కుదించారు. ఈ నిర్ణయం భారత్‌కు మరింత ప్రత్యేకంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువ టారిఫ్ విధించింది. అంటే ఇకపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సరుకులపై పన్ను భారం తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం నేరుగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌పై పడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ