ట్రేడ్‌ డీల్‌పై ట్రంప్‌ ప్రకటన వేళ.. మోదీకి ఎన్డీఏ ఎంపీల సన్మానం
ఢిల్లీ,03ఫిబ్రవరి (హి.స.) ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ భేటీ (NDA Meet) ప్రారంభమైంది. పార్లమెంట్‌ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని సన్మానించారు. భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ (US Trade Agreement)కు
PM Modi


ఢిల్లీ,03ఫిబ్రవరి (హి.స.) ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ భేటీ (NDA Meet) ప్రారంభమైంది. పార్లమెంట్‌ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని సన్మానించారు. భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ (US Trade Agreement)కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఓకే చెప్పిన నేపథ్యంలో.. ఒప్పందం కోసం ప్రధాని చేసిన కృషికి గాను ఈ సన్మానం చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష, అధికారపక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కీలక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులోభాగంగా ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష, అధికార పక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఇకపై పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన ప్రశ్నలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande