'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు ఇక మహర్దశ.. నిర్మల సీతారామన్
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స. భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ''మేడ్ ఇన్ ఇండియా'' ఉత్పత్తులకు ఇక మహర్దశ అంటూ ఆసక్తికర
Nirmala


హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స. భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు ఇక మహర్దశ అంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. భారతదేశ తయారీ రంగానికి, ఎగుమతిదారులకు ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా (Made In India) ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande