
హైదరాబాద్, 02 ఫిబ్రవరి (హి.స.)
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ తో
జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. క్రీడలను ఈ విధంగా రాజకీయం చేయడం రెండు వైపులా అవమానకరమని అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కోల్కతా తరపున ఆడేందుకు కాంట్రాక్ట్ నిరాకరించడం దురదృష్టకరమని, దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ చేసిన రియాక్షన్ అతిగా ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఇప్పుడు దానికి సంఘీభావం తెలపడం వల్ల పరిస్థితి అదుపు తప్పుతోందని అన్నారు. రాజకీయ విభేదాలు క్రీడా మైదానంలోకి రావడం క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఎంపీ థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న క్రికెట్ వంటి ఆట ప్రజలను ఏకం చేసే సాధనంగా ఉండాలి తప్ప, విభజించేలా ఉండకూడదని ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులపై ఐసీసీ (ICC) తక్షణమే స్పందించి, ఒక అత్యవసర వేదికను ఏర్పాటు చేసి సంబంధిత దేశాలతో చర్చలు జరపాలని ఆయన సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు