రూర్కీ, 13 అక్టోబర్ (హి.స.)ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్ కనిపించడం కలకలం రేపింది. వెంటనే గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తమవడంతో.. ప్రమాదం త్రుటిలో తప్పింది.
ఉత్తర రైల్వే సీపీఆర్‌వో అధికారి పేర్కొన్న వివరాల ప్రకారం.. లలాండౌర్- ధంధేరా స్టేషన్ల మధ్య ఉదయం 6:35 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది. గూడ్స్ రైలు స్టేషన్ సమీపానికి వస్తుండగా.. లోకో పైలట్ పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్ ఉండటాన్ని గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సిలిండర్‌ను ఘటనా స్థలానికి దూరంగా తీసుకెళ్లి పరిశీలించగా.. అది ఖాళీది అని తేలింది. స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. యూపీలోని లలిత్‌పూర్‌లో రైల్వేట్రాక్‌పై ఇనుప రాడ్లను ఉంచి రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు