స్పోర్ట్స్, 13 అక్టోబర్ (హి.స.)
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. నేడు ఆస్ట్రేలియాతో భారత్ కీలక పోరు
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో నేడు భారత్ అత్యంత కీలక మ్యాచ్కు సిద్ధమవుతుంది. సెమీస్ రేసులో ముందుకెళ్లాలంటే ఆస్ట్రేలియాపై గెలిచి తీరాల్సిందే. భారత్ ప్రస్తుతం మూడు మ్యాచ్లలో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు ఆసీస్ తో గెలిస్తే 6 పాయింట్లతో సెమీస్ కు చేరువవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయినా సెమీస్ ఆశలు సజీవంగానే ఉంటాయి. అప్పుడు న్యూజిలాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..