రైతులను రాజులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వరంగల్, 18 అక్టోబర్ (హి.స.) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతుల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. అందులో భాగంగానే రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తూ రైతులను రాజు చేయడమే లక్
పాలకుర్తి ఎమ్మెల్యే


వరంగల్, 18 అక్టోబర్ (హి.స.)

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతుల

అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. అందులో భాగంగానే రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తూ రైతులను రాజు చేయడమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలలో ఎవరైనా చీటింగ్ చేసినట్లయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు కాట్రపల్లి గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవితో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మాట్లాడుతూ... రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే రైతులకు సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కురూ. 500 రూపాయలు బోనస్ అందిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని ఆమె కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande