డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన అమీర్పేట పోలీసులు
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) డ్రగ్స్కు అలవాటుపడి కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బు లభించక పోవడంతో అమ్మకందార్లగా మారి డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన ఘటన అమీర్పేట్ పరిధిలో జరిగింది. అమీర్పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో
అమీర్పేట పోలీసులు


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)

డ్రగ్స్కు అలవాటుపడి కొనుగోలు

చేయడానికి అవసరమైన డబ్బు లభించక పోవడంతో అమ్మకందార్లగా మారి డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన ఘటన అమీర్పేట్ పరిధిలో జరిగింది. అమీర్పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంజారాహీల్స్ రోడ్ నెంబర్ 7లో బైక్పై ముగ్గురు వ్యక్తులు సుధాకర్రెడ్డి, నితిన్, ప్రకాష్ కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీమ్ సీఐ మహేష్, ఎస్సై వరదాభూపాల్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు. ముగ్గురి వద్ద 22.33 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా పీలేరులో ఉండే సుదర్శన్ రెడ్డి నుండి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రాముకు రూ. 5000 వేల నుంచి రూ. 6000 వేలకు అమ్మకాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్, వాహనాలు, సెల్పోన్ల విలువ కలిపి సుమారు రూ.2.15 లక్షల మేర ఉంటుందని తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. సిబ్బందిని అసిసస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఏఈఎస్ స్మీత సౌజన్యలు అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande