విజయవాడ, 23 అక్టోబర్ (హి.స.) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం ( జరగనుంది. ఈ భేటీలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల