కాకినాడ జిల్లా కా మండలం  ఉప్పుమల్లిలో 7 కుటుంబాలను.గ్రామ.బహిష్కరణ
కాకినాడ, 3 జనవరి (హి.స.)సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో కుల పెద్దలు నిర్ణయించారు. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా తమ అభీష్టానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిన ఏడు కుటుంబాలపై గ్రామ పెద్దలు కన్నెర్న చేశారు. అంతే వారిని వెలి వేస్తూ గ్రా
 కాకినాడ జిల్లా కా మండలం  ఉప్పుమల్లిలో 7 కుటుంబాలను.గ్రామ.బహిష్కరణ


కాకినాడ, 3 జనవరి (హి.స.)సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో కుల పెద్దలు నిర్ణయించారు. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా తమ అభీష్టానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిన ఏడు కుటుంబాలపై గ్రామ పెద్దలు కన్నెర్న చేశారు. అంతే వారిని వెలి వేస్తూ గ్రామ పెద్దలు తీర్మానించారు. సభ్య సమాజం నివ్వెరబోయే ఈ ఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఉప్పుమిల్లిలో ఏడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశాయి. అలా వేయడాన్ని గ్రామ, కుల పెద్దలుగా వ్యవహరిస్తున్న వైసీపీకి చెందిన వారు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో ధాన్యం పాట సొమ్ములు వద్ద ఇరు పక్షాల మధ్య వివాదం తలెత్తింది. అది పెద్దదిగా మారింది. అంతే వెలి తీర్మానం జరిగిపోయింది. వెలి వేసిన కుటుంబంలోని వారితో ఎవరైనా మాట్లాడితే రూ.5,000 జరిమానా చెల్లించాలని తీర్మానించారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు పిలవకూడదని, పనులకు పిలవకూడదని కట్టడి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande