మద్దతు ధరలకు చట్టబద్ధత కోసం ఇతర రాష్ట్రాల రైతులూ ఉద్యమించాలి
చండీగడ్‌: 5 జనవరి (హి.స.)కనీస మద్దతు ధర (ఎంఆర్‌పీ)కు చట్టబద్ధత సాధించడానికి అన్ని రాష్ట్రాల రైతు సంఘాలు పోరాటం చేయాలని నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పిలుపునిచ్చారు. పంటలకు ఎంఆర్‌పీ అనేది పంజాబ్‌కు మాత్రమే కాకు
 మద్దతు ధరలకు చట్టబద్ధత కోసం ఇతర రాష్ట్రాల రైతులూ ఉద్యమించాలి


చండీగడ్‌: 5 జనవరి (హి.స.)కనీస మద్దతు ధర (ఎంఆర్‌పీ)కు చట్టబద్ధత సాధించడానికి అన్ని రాష్ట్రాల రైతు సంఘాలు పోరాటం చేయాలని నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పిలుపునిచ్చారు. పంటలకు ఎంఆర్‌పీ అనేది పంజాబ్‌కు మాత్రమే కాకుండా యావద్దేశానికీ అవసరమే అన్నారు. ఇది కేవలం పంజాబ్‌ చేస్తున్న పోరాటం కాదని, దేశం యావత్తూ నిర్వహిస్తున్న సంగ్రామమన్న సందేశం కేంద్ర ప్రభుత్వానికి చేరేలా పనిచేయాలని ఆయన ఇతర రాష్ట్రాల రైతు సంఘాలను కోరారు. ఖనౌరీ సరిహద్దులో శనివారం ‘కిసాన్‌ మహా పంచాయత్‌’ను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల ప్రయోజనం కన్నా తన ప్రాణం ముఖ్యం కాదన్నారు. 70 ఏళ్ల దల్లేవాల్‌ స్ట్రెచర్‌పై పడుకొని ఉన్న స్థితిలో వేదికపై నుంచి 11 నిమిషాలు ప్రసంగించారు. ఆయన చేపట్టిన నిరవధిక నిరశన శనివారం నాటికి 40 రోజులకు చేరింది.

-

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande