పదేళ్ల బిజెపి పాలనలో భారత రైల్వేశాఖలో అనేక సంస్కరణలు..  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, 6 జనవరి (హి.స.) పదేళ్ల పాలనలో తాము భారత రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5.413 కోట్లతో ఎయిర్పోర్టును తలపించేలా చర్లపల
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 6 జనవరి (హి.స.)

పదేళ్ల పాలనలో తాము భారత రైల్వే

శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5.413 కోట్లతో ఎయిర్పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్ను నిర్మించామని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ లో 100 శాతం లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని అన్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్ల ఇంకా రావాల్సింది ఉందని.. వారు ఇవ్వకపోయినా తెలంగాణ తిరుపతి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ను పొడిగించామని అన్నారు. అదేవిధంగా కొమురవెల్లిలో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని కిషన్ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande