గూడ్స్ రైలు  పొందుగల.నడికుడి  స్టేషన్లో మధ్య  పట్టాలు తప్పింది
విజయవాడ, 7 జనవరి (హి.స.) దాచేపల్లి, : గూడ్స్‌ రైలు పొందుగల-నడికుడి స్టేషన్ల మధ్య సోమవారం అర్ధరాత్రి పట్టాలు తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వస్తున్న గూడ్స్‌ 13వ నంబర్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పడంతో ప్రధాన లైన్‌లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మరమ్మత
 గూడ్స్ రైలు  పొందుగల.నడికుడి  స్టేషన్లో మధ్య  పట్టాలు తప్పింది


విజయవాడ, 7 జనవరి (హి.స.)

దాచేపల్లి, : గూడ్స్‌ రైలు పొందుగల-నడికుడి స్టేషన్ల మధ్య సోమవారం అర్ధరాత్రి పట్టాలు తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వస్తున్న గూడ్స్‌ 13వ నంబర్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పడంతో ప్రధాన లైన్‌లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మరమ్మతులు చేపట్టడానికి గుంటూరు రైల్వేస్టేషన్‌ నుంచి సిబ్బంది పొందుగల స్టేషన్‌కు వెళ్లారు. ఈ మార్గంలో నడవాల్సిన తిరుపతి స్పెషల్‌, నర్సాపూర్‌, కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తెలంగాణలోని మిర్యాలగూడ స్టేషన్‌లో నిలిపివేశారు. లింగంపల్లి, నారాయణాద్రి, హైదరాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. సుమారు 3 గంటలకు పైగా రాకపోకలకు అంతరాయం కలిగింది. మరమ్మతుల అనంతరం వేకువజామున 3.15 గంటల నుంచి రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande