ప్రభుత్వ ఆసుపత్రుల ను మరింత గా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.. బీజేపీ ఎంపీ, డీ.కే. అరుణ
తెలంగాణ, 8 జనవరి (హి.స.) ప్రభుత్వ ఆసుపత్రుల ను మరింత గా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని బీజేపీ ఎంపీ, డీ.కే. అరుణ అన్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ కీలక సమావేశానని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయ
బిజెపి ఎంపీడీకే అరుణ


తెలంగాణ, 8 జనవరి (హి.స.)

ప్రభుత్వ ఆసుపత్రుల ను మరింత గా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని బీజేపీ ఎంపీ, డీ.కే. అరుణ అన్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ కీలక సమావేశానని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర, వైద్యాధికారులతో కలిసి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ నా కూతురు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పుట్టిందని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ ఇదే పెద్దాస్పత్రి అని పేర్కొన్నారు.

అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మాణం జరుగుతోందని..ఆసుపత్రిలో ప్రస్తుత వసతులు బాగానే ఉన్నప్పటికి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ఎంపీ, ఎమ్మెల్యేల ఫండ్స్ సరిపోవని, అందుకే తాను స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధుల మంజూరుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆస్పత్రికి అవసరమైన సొలార్ లైట్స్, ఒక అంబులెన్స్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande