ముఖ్యమంత్రి చంద్రబాబు.ఆదేశం తో.హుటాహుటిన  మంత్రి.ఆనం  రామనారాయణ రెడ్డి తిరుపతి చేరుకున్నారు
విజయవాడ, 9 జనవరి (హి.స.)తిరుపతి ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఆనం అమరావతి నుంచి మృతుల‌ కుటుంబాలకు అండగా ఉండేందుకు హుటాహుటీన తిరుపతికి చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్
ముఖ్యమంత్రి చంద్రబాబు.ఆదేశం తో.హుటాహుటిన  మంత్రి.ఆనం  రామనారాయణ రెడ్డి తిరుపతి చేరుకున్నారు


విజయవాడ, 9 జనవరి (హి.స.)తిరుపతి ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఆనం అమరావతి నుంచి మృతుల‌ కుటుంబాలకు అండగా ఉండేందుకు హుటాహుటీన తిరుపతికి చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలు చేపట్టి.. పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తిరుపతిలో జరిగి‌‌న సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, సంక్రాంతి‌ పండుగ సమయంలో దురదృష్టకర సంఘటన‌ చోటుచేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఘటనకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారని.. దీంతో టీటీడీ, పోలీసు అధికారులతో సమీక్షీస్తున్నామని మంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande