హైదరాబాద్, 9 జనవరి (హి.స.)
తిరుపతి తొక్కిసలాటలో తాము తీవ్రంగా గాయపడ్డామని.. ఈ నేపథ్యంలో తనకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలంటూ సీఎం చంద్రబాబును క్షతగాత్రులు కోరారు. వారి కోరికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. తిరుపతిలో చోటు చేసుకొన్న తొక్కిసలాటలో గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రలను సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తోపులాట ఎలా జరిగిందో.. భక్తులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
అలాగే గతానికి.. ఇప్పటికి ఉన్న తేడా ఏమిటని ఈ సందర్భంగా భక్తులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అదే విధంగా ఈ ఘటన గల కారణాలపై భక్తుల నుంచి ఆయన మరింత సమాచారాన్ని సేకరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు