హైదరాబాద్, 9 జనవరి (హి.స.)తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించాలని విన్నవించారు. తిరుపతిలో పవన్ మీడియాతో మాట్లాడారు. ఇంత మంది అధికారులున్నా.. ఆరుగురి ప్రాణాలు పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు.. భక్తులను కంట్రోల్ చేయలేరా? అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారంటూ ఫైరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు