విజయవాడ, 9 జనవరి (హి.స.)
-అమరావతి, -గుంటూరు రైల్వే: గుంటూరు నగరంలో అంతర వలయ రహదారిలో గడ్డిపాడు వద్ద ఉన్న రైల్వే మార్గంపై రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రైల్వేశాఖ రూ. 107.79 కోట్లు మంజూరు చేసింది. సవివర ప్రాజెక్టు నివేదిక, ఆకృతులు, భూసేకరణ తదితర పనులు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు కేంద్రం లేఖ రాయడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది.
రైల్వేమార్గం వద్ద గేటు పడితే ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. గేటు తెరిచాక ట్రాఫిక్ సర్దుబాటు కావడానికి పది నిమిషాలకుపైగానే పడుతోంది. రైళ్లు వెళ్లే వరకు వేచి చూసే సమయం కలిపితే చాలాసేపు నిరీక్షించాల్సి వస్తోంది. గుంటూరు నగరంలో వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో విజయవాడవైపు వెళ్లే వారికి రైల్వేగేటు వద్ద నిరీక్షణ తప్పడం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల