ఏ.పీ /తెలంగాణ, 9 జనవరి (హి.స.)
హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే..
తాజాగా ఈ కేసు పై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
అలాగే నష్టపరిహారం కావాలా లేక జైలుకు పంపాలా అని ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. అలాగే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అని మోహన్ బాబు తరపున వాదన వినిపించిన సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గాను ప్రశ్నించింది ధర్మాసనం. అయితే తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగింది, జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పాను, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను, 76 ఏళ్ల వయసున్న తాను కావాలని దాడి చేయలేదు, ఆవేశంలో జరిగింది, జర్నలిస్టులు నా ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారు అని కోర్టుకు తెలిపారు మంచు మోహన్ బాబు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్