తిరుపతి బాధితులను పరామర్శించిన మంత్రుల బృందం.. మరియు ఈవో శ్యామలరావు
ఏ.పీ /తెలంగాణ, 9 జనవరి (హి.స.) తిరుపతిలో నిన్న క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఏపీ మంత్రులు పరామర్శించారు. మంత్రులు హోం మంత్రి వంగలపూడి అనిత , ఆనం రాంనారాయణరెడ్డి , అనగాని , పార్థసారథి , తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివ
తిరుపతి ఘటన మంత్రుల బృందం


ఏ.పీ /తెలంగాణ, 9 జనవరి (హి.స.)

తిరుపతిలో నిన్న క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఏపీ మంత్రులు పరామర్శించారు. మంత్రులు హోం మంత్రి వంగలపూడి అనిత , ఆనం రాంనారాయణరెడ్డి , అనగాని , పార్థసారథి , తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు హరిప్రసాద్ బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరోవైపు

తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్సపొందుతున్న వారిని టీటీడీ ఈవో శ్యామలరావు పరామర్శించారు వద్దకు వెళ్లి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యుల నుంచి స‌మాచారం సేక‌రించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం 41 మందికి గాయాలపాలు కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా తేలిందని వెల్లడించారు. పూర్తి విచారణ తరువాత అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande