హెచ్ఎంపీవీ వైరస్ పై భక్తులకు కీలక సూచనలు చేసిన టిటిడి చైర్మన్..
ఏ.పీ /తెలంగాణ, 8 జనవరి (హి.స.) చైనాలో విజృంభిస్తున్న HMPV వైరస్ మహమ్మారి పొరుగు రాష్ట్రాల్లో కొందరి చిన్నారుల్లో గుర్తించారు. దేశంలో HMPV వైరస్ వ్యాప్తి చెందుతోంది. మంగళవారం కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో ఏడు హెచ్ఎంపీవీ కేసులు నమోద
టీటీడీ చైర్మన్


ఏ.పీ /తెలంగాణ, 8 జనవరి (హి.స.)

చైనాలో విజృంభిస్తున్న HMPV వైరస్ మహమ్మారి పొరుగు రాష్ట్రాల్లో కొందరి చిన్నారుల్లో గుర్తించారు. దేశంలో HMPV వైరస్ వ్యాప్తి చెందుతోంది. మంగళవారం కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో ఏడు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కరోనా అంతటి ప్రమాదకరమైందని కాదని, జాగ్రత్తలను పాటిస్తే దరిచేరదని వైద్యులు అంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు కీలక సూచనలు చేశారు. HMPV అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలి అని చైర్మన్ కోరారు.

దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. గుంపులతో కూడిన ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. ఇదిలా ఉంటే.. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. 10 తేదీన ఉదయం 4.30కు ప్రోటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని ప్రత్యేక దర్శనాలను 10 రోజులు రద్దు చేశాం. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దు. 3K CC కెమెరాలతో నిఘా ఉంచామని చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande