విజయవాడ, 8 జనవరి (హి.స.)
విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన కొనసాగుతోంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అడుగడుగునా పూలు చల్లుతూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మోదీ, చంద్రబాబు, పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
రోడ్ షో అనంతరం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరైన మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికారు. వేదికపై ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సత్కరించి.. శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీ కిట్‌ను బహూకరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఎంపీలు భరత్, పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల