విజయవాడ, 7 జనవరి (హి.స.)
, శ్రీకాకుళం నగరం: అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయం కొత్తరూపు సంతరించుకోనుంది.. వచ్చే రథసప్తమి వేడుకలను ప్రజలు గుర్తుంచుకునేలా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతంలో వీటిని ఒక్కరోజే నిర్వహించేవారు. ఇటీవల రాష్ట్ర పండగగా గుర్తించిన నేపథ్యంలో మూడు రోజుల పాటు చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల