విజయవాడ, 6 జనవరి (హి.స.)
హైదరాబాద్: సినీనటుడు అల్లు అర్జున్‌కు ) రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈమేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని అందులో పేర్కొన్నారు. ఆసుపత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చారు. బెయిల్ షరతులు తప్పనిసరిగా పాటించాలని అందులో సూచించారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ అనే బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. (Telangana news)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల