శ్రీ శైలం లో  అర్థరాత్రి  చిరుతపులి కలకలం
విజయవాడ, 6 జనవరి (హి.స.) నంద్యాల జిల్లా: శ్రీశైలం)లో అర్ధరాత్రి చిరుతపులి కలకలం () రేపింది. పాతాళగంగ ()లోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుత సంచరించింది. చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరా )లో రికార్డు అయ్యాయి. దీంతో భక్తులు () తీవ్ర భయాందోళ
శ్రీ శైలం లో  అర్థరాత్రి  చిరుతపులి కలకలం


విజయవాడ, 6 జనవరి (హి.స.)

నంద్యాల జిల్లా: శ్రీశైలం)లో అర్ధరాత్రి చిరుతపులి కలకలం () రేపింది. పాతాళగంగ ()లోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుత సంచరించింది. చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరా )లో రికార్డు అయ్యాయి. దీంతో భక్తులు () తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణా, అనంతరపురం జిల్లాల ప్రజలను చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఆదివారం ఉదయం పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. మెట్లపల్లి సమీపంలోని ఆయిల్ పామ్ తోట వద్ద చిరుత సంచరించినట్లు ఆర్టీసీ బస్ కండక్టర్ రవికిరణ్ తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు స్థానికంగా ఉన్న కొండగట్టుపైకి వెళ్తుండగా.. అదే సమయంలో పులి తన పిల్లలతో రోడ్డు దాటుతుండడాన్ని కండక్టర్ గుర్తించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande