హైదరాబాద్, 5 జనవరి (హి.స.)
‘హైందవ శంఖారావం’ పేరుతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
హిందూ ఆలయాకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా ఈ సభ జరగనుంది. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. హిందూ సమాజం ఆకాంక్షలపై దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఇందులో మాట్లాడతారని వీహెచ్‌పీ ఏపీ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధువులు, మఠాధిపతులు సహా 4 లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, మిలింద్ పరాండే, కోటేశ్వర శర్మ, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గోవింద దేవ్ గిరి మహరాజ్ హాజరవుతున్నారు. సభకు 3,300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు 15 ప్రత్యేక రైళ్లతో పాటు రెండు వేల బస్సులను నడుపుతున్నారు. కంకిపాడు మండలం ఉప్పులూరు రైల్వే స్టేషన్‌కు 15 ప్రత్యేక రైళ్లలో ఆదివారం తెల్లవారుజామున కార్యకర్తలు తరలివచ్చారు.
,
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..