అల్లు అర్జున్ కు మరో షాక్.. కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లొద్దంటూ నోటీసులు..
హైదరాబాద్, 5 జనవరి (హి.స.) టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు మరోమారు షాక్ తగిలింది. తాజాగా రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులను జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ న
అల్లు అర్జున్


హైదరాబాద్, 5 జనవరి (హి.స.)

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు

మరోమారు షాక్ తగిలింది. తాజాగా రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులను జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల అభిప్రాయం ప్రకారం, హాస్పిటల్కు వెళ్ళడం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల, అతను వచ్చినట్లయితే ఏదైనా అక్కడ జరిగే పరిణామాలకు పూర్తిగా బాధ్యత వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అల్లు అర్జున్ పోలీసులు వచ్చిన సమయానికి నిద్ర లేవలేదని చెప్పడంతో, మేనేజర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, పోలీసులు కోర్టు పర్మిట్ లేకుండా అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్లకూడదని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande