హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
అక్కినేని నాగేశ్వరరావు శత దినోత్సవాలకు సంబంధించిన ఈవెంట్ ఇటీవల గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఈ ఏడాది అక్కినేని జాతీయ పురస్కారం చిరంజీవి కి ఇవ్వనున్నట్లు నాగ్ ప్రకటించారు. అయితే ఈ వేడుక అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుండగా.. ఈ ఈవెంట్కు అమితాబ్ బచ్చన్ గెస్ట్గా రానున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నేడు నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించాలని గౌరవంగా ఆహ్వానించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్