రాష్ట్రంలో సంచలనం సృష్టించిన  ముంబై నటి  కాదంబరి కేసు  సిఐడి విచారణ
విజయవాడ, 30 అక్టోబర్ (హి.స.) అమరావతి, అక్టోబర్ 30: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ (కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఈరోజు విచారణకు జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన  ముంబై నటి  కాదంబరి కేసు  సిఐడి విచారణ


విజయవాడ, 30 అక్టోబర్ (హి.స.)

అమరావతి, అక్టోబర్ 30: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ (కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఈరోజు విచారణకు జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నిన్న (మంగళవారం) ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి రికార్డులు సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విద్యాసాగర్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో మరోసారి జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande