ఏ.పీ, 30 అక్టోబర్ (హి.స.)ఏపీలో వైఎస్ జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) ఆస్తుల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిన్న వైఎస్ జగన్, షర్మిల వివాదం పై తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma) విషయం తెలిసిందే. అయితే వైఎస్ విజయమ్మ రాసిన లేఖకు నేడు(బుధవారం) వైసీపీ ట్విట్టర్(YCP Twitter) వేదికగా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దివంగత మహానేత వైయస్సార్గారి భార్యగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిగారి తల్లిగా శ్రీమతి విజయమ్మగారిని అమితంగా గౌరవిస్తాం. YSRగారి కుటుంబ వ్యవహారంపై విజయమ్మగారు బహిరంగ లేఖ విడుదలచేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం” అని వైసీపీ ట్వీట్లో రాసుకొచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..