
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)
సినిమా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కేవలం పోటీ మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప వేదికగా నిలిచిందని కొనియాడారు. యువత సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇస్తూ కళ, సంస్కృతి, సినిమారంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..