
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సహచర మంత్రి మహ్మద్ అజారుద్దీన్, జూబ్లీహిల్ల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన శ్మశానవాటికలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా మైనార్టీలు శ్మశానవాటికలు లేక ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను వీలైనంత త్వరితగతిన రక్షణశాఖ, రెవెన్యూ, వక్ఫ్స్బర్డ్ సమన్వయంతో అధిగమించాలని అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..