
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, నదీ జలాలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభాపక్షం (బీఆర్ఎస్ఎల్పీ) స్పీకర్కు వినతిపత్రం సమర్పించింది. ఈ మేరకు సోమవారం స్పీకర్ ఛాంబర్లో బీఆర్ఎస్ఎల్పీ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ వినతిని స్పీకర్ పరిశీలనకు తీసుకున్నట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..