ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కల్పించాలి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
రాజన్న సిరిసిల్ల, 30 అక్టోబర్ (హి.స.) జిల్లాలోని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ( Collector Sandeep Kumar Jha) ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్


రాజన్న సిరిసిల్ల, 30 అక్టోబర్ (హి.స.)

జిల్లాలోని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ( Collector Sandeep Kumar Jha) ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు, ఎయిడ్స్, టీబీ, కుష్టు తదితర కేసులపై క్షుణ్ణంగా చర్చించారు. జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో, వారికి ఎలాంటి వైద్య సేవలు, మందులు అందిస్తున్నారో ఆరా తీశారు. ఎయిడ్స్, టీబీ, కుష్టు నిర్ధారణకు కావాల్సిన కిట్లు, మందుల పై ఆరా తీశారు. జిల్లాలో మొత్తం టీబీ కేసులు 831, ఎయిడ్స్ కేసులు 550, కుష్టు కేసులు 14 ఉన్నాయని కలెక్టర్ దృష్టికి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వసంతరావు తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande