మరోసారి పంజా విసిరిన ఏసీబీ.. రెడ్యోండెడ్గా దొరికిన నలుగురు అధికారులు
తెలంగాణ, 07 జనవరి (హి.స.) రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వరుసగా దాడులు చేపట్టి అవినీతి అధికారుల భరతం పడుతున్నా.. అక్రమార్జనకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా బుధవారం, రెండు వేర్వేరు ఘటనల్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు పంచాయత
ఏసీబీ


తెలంగాణ, 07 జనవరి (హి.స.)

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వరుసగా దాడులు చేపట్టి అవినీతి అధికారుల భరతం పడుతున్నా.. అక్రమార్జనకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా బుధవారం, రెండు వేర్వేరు ఘటనల్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు పంచాయతీరాజ్ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ ప్రాంతంలోని దేవాదాయ శాఖ భూమికి సంబంధించి సర్వే రిపోర్టు ఇచ్చేందుకు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి నుంచి మొత్తం రూ.1.50 లక్షలు డిమాండ్ చేయగా, అందులో మొదటి విడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఓ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ. లక్ష లంచం డిమాండ్ చేసిన అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్సంగ్, ఈదులపల్లి పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య ఉన్నారు. భవన నిర్మాణానికి సహకరించేందుకు రూ.లక్ష తీసుకుంటుండగా అధికారులు వారిని పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande