
హైదరాబాద్, 08 జనవరి (హి.స.)
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) పాఠశాలల్లో బంకర్ బెడ్ల టెండర్లలో రూ.100 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కమిషన్ల కోసమే బంకర్ బెడ్ల ధరలను అసాధారణంగా పెంచారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఉన్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు